పథక వ్యూహం

ప్రధాన లక్ష్యాలను మరియు కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని సమితి అంతటిని విభజించవలసి ఉంటుంది. దానికి సంబంధించిన వ్యూహం వివరణ ఇక్కడ ఇవ్వబడుతుంది:
  » సి.ఎస్.టి.సి. సహాయం అందించటం, అధికరణలోని అన్ని భారతీయ భాషలకు సాంకేతిక శాస్త్రీయ పరిభాష సృజించటంలో సలహాలను ఇవ్వటం. ఈ లక్ష్య దిశగా శాస్త్రీయ మరియు సాంకేతిక పరిభాషా సంఘం కావలసిన చర్యలు తీసుకుంటుంది. పరిభాషా సి.ఎస్.టి.టి. ఆదేశాలను పరిణమింపజేయటం మరియు నిర్వచించి, హిందీ మరియు ఆధునిక భారతీయ భాషలకు, శాస్త్రీయ మరియు సాంకేతిక పరిభాష సిద్ధపరచటానికి ఇది ఈ పరిసరంలో తీవ్రమైన పాత్రను పోషిస్తుంది. ఈ కార్యక్రమ ఫలితాలను జాఅస లో వినియోగిస్తారు. మరోవైపు జాతీయ అనువాద సమితి (జాఅస) కూడా అధికరణలోని 22 భాషలలోని పరిభాష సృజనకు సి.ఎస్.టి.టి. ప్రయత్నాలన్నింటిని బలోపేతం చేస్తుంది. ఆ రీతిగా జ్ఞాన ఆధారిత గ్రంధ అనువాదాలు త్వరితంగా చేయటానికి సమర్థత కలిగిస్తుంది. జాఅస ఉపకరణాలను వృద్ధిచేయటానికి ఈ పరిభాష అంతా అన్ని 22 భాషలలో ఆన్లైన్లో అందుబాటులో ఉండే సమర్థతను కలిగి వుండటానికి సి.డి.ఎ.సి. మరియు సి.ఐ.ఐ.ఎల్.లతో కలిసి పని చేస్తుంది.
  » ఎలక్ట్రానిక్ నిఘంటువులు/పర్యాయపదకోశాలు దానంతట అది గాని బయటి వనరుల లక్ష్యాలద్వారాగాని సిద్ధపరచవలసి ఉంటుంది.
  » జ్ఞాన ఆధారిత గ్రంథాలను మన కళాశాల మరియు విశ్వవిద్యాలయాలలో బోధించే జ్ఞాన ఆధారిత గ్రంథాలను అన్ని ప్రధాన శాస్త్రాలలో దాదాపు 65 నుంచి 70కి పైగా ఉన్న (తొలిగా 42 శాస్త్రాల పై దృష్టి పెట్టి) వాటిని మరియు 200 పాఠ్యగ్రంథాలను 11వ ప్రణాళికలో అచ్చువేయవలసి ఉంటుంది. (ఇది ఉటంకించదగినదనుకుంటాము. ప్రస్తుతం ఎన్.సి.ఇ.ఆర్.టి. వారి 12వ తరగతి వరకు ఉన్న పాఠ్యగ్రంథాలను హిందీ-ఉర్దూ భాషలలో అనువాదం చేస్తుంది, తదనంతర ప్రణాళికల్లో అనువదించటం మరియు ముద్రించటం చేయాలి. ఒక సారి ఈ ప్రక్రియ ఆరంభించినట్లయితే ఒక ఆశావాద అంచనాల్లో ఒక ప్రణాళికా కాలానికి 8,800 పుస్తకాల వరకు పెరగవచ్చు.
  » భారతీయ భాషలలో అనువాద పత్రికలకు ఆర్థిక సహాయం లేక అనువాద సంబంధ గ్రంథాలను అచ్చువేయటం మరియు విశ్లేషణ మొదలైనది.
  » రచయితలకు, అనువాదకులకు వారి ఐ.పి.ఆర్. కాపీరైట్ రుసుము నిధులను (సమకూర్చటం)
  » అనువాద శిక్షణ స్థాయి గుర్తింపుకు, నిధులు
  » నాచురల్ లాంగ్వేజ్ ప్రొసెసింగ్ లేక ఎన్.ఎల్.పి. అనువాద సంబంధ పరిశోధనకు నిధులు
  » అనువాద పాఠ్య క్రమాల డిగ్రీలు లేక డిప్లొమాలను నిర్వహిస్తున్న విశ్వవిద్యాలయ శాఖలకు నిధులు, ప్రత్యేక పథకాలకు (భాషాజంటల మధ్య అనువాద పుస్తకాలను రచించేవారికి)

ముగించటానికి, ఇవన్నీ ప్రతిపాదించిన జాఅస కింద చేపట్టి సాధ్యపరచవచ్చు. ఆశిస్తున్న ఫలితాలను సాధించటానికి సమితి కింది ప్రధాన లక్ష్యాల పైన మాత్రమే గురినిలిపినప్పుడే:
  » అనువాదకుల సమాచార నిధిని వివిధ పరిసరాలలో యోగ్యత, నైపుణ్యాలను బట్టి సృజించటం, ఈ నిధి ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. ప్రత్యేక అవసరాలతో జాఅసను సంప్రదించటం ద్వారా దీనిని చేయవచ్చు.
  » సమాచార నిధిని మరియు ప్రస్తుతమున్న వివిధ అనువాద రచనలకు వివరణ పట్టిక తయారుచేయటం, పరిసరాలనుబట్టి వర్గీకరించటం, కొత్త జాబితాలతో విద్యాసంస్థలకు క్రమంగా పెంచుతూ ఉండటం, గ్రంథాలకు అనుసంధానత మొదలైనవి.
  » అనువాదకులకు స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలు.
  » మంచి అనువాద సామగ్రిని ఉన్నతి కల్పించడం, వ్యాప్తి చేయటం.
  » యంత్రానువాద ఉన్నతి.

ఈ పత్రికలను విస్తరింపజేయటానికి వాటికి సహాయపడటానికి యోగ్యతకలిగి వుండాలి. ఇక్కడ కొన్ని తాత్కాలిక పేర్ల జట్టును ఇస్తున్నాము. ఒకసారి పథకం ఆమోదమైన తరువాత వీటిపై తదనంతర చర్చ చేయవలసి ఉంటుంది.
 
అనువాదానికి పత్రికలు
(జాఅస సహాయానికి విలువైనవి ప్రతిపాదన)

అస్సామి
1. గరియసి (సంపాదకుడు హరేకృష్ణ దేక)
2. ప్రాంతిక్ (సంపాదకుడు - పి.జి. బారువ)
3. అనురాధ్ పరంపర (సంపాదకుడు పి. ఠాకూర్)

బంగ్లా/బెంగాలి
4. అనుబాద్ పత్రిక
5. బాషానగర్ (ప్రస్తుతం-అప్పుడప్పుడు)
6. భాషా బంధన్
7. ఎబాంగ్ ముషైరా (జ్ఞాన ఆధారిత విషయాల పై వ్యాసాలను ప్రచురిస్తుంది)
8. బిజ్ఞాపన్ పర్వ (అనువాదకళ మరియు విమర్శనాత్మక రచన)
9. అంతర్జాతిక్ అంగిక్ (అనువాద సంబంధ ప్రాంతము) అంతర్జాతీయ విషయాలపై దృష్టి నిలుపుతుంది.
10. పర్బంతర్ (ముఖ్యంగా ప్రాంతీయ అనువాదాలపై గ్రంథాలు లేక రచయిత పై కేంద్రీకరిస్తుంది.

బోడో
11. బోడో సాహిత్య సభాపత్రిక

ఇంగ్లిష్
12. ఇండియన్ లిటరేచర్ (సాహిత్య అకాడెమీ)
13. ట్రాన్స్లేషన్టుడే (సి.ఐ.ఐ.ఎల్. నుండి వెలువడే అనువాద అధ్యయనాల మాసపత్రిక)
14. యాత్ర (అస్సామి నుండి అనువాద అధ్యయనాల పత్రిక)
15. అనికేతన (కన్నడ నుండి)
16. మలయాళ సాహితీ సర్వే (మలయాళం నుండి)
17. ఉర్దూ ఎలైవ్ (ఉర్దూ నుండి)
18. కొబిత రివ్యూ (ద్విభాష బెంగాలీ - ఇంగ్లిష్)
19. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ట్రాన్స్లేషన్ (బెహరీ ప్రచురణలు)

గుజరాతీ
20. వి (అనువాద అధ్యయనాలకు సంబంధించి విస్తృతంగా ప్రచురిస్తుంది)
21. గద్యపర్వ

హింది
22. తనవ్ ( వివిధ భాషల నుంచి - భారతీయ మరియు విదేశ)
23. అనువాద్ (ఇతర భాషలనుంచి అనువాదాలు మరియు అనువాదం పైన వ్యాసాలు కూడా)
24. పహల్ (అనువాదాల కోసం మాత్రమే కాదు ఇంకా అనేక ఇతరాలు అచ్చువేస్తుంది
25. సమకాలీన్ భారతీయ - సాహిత్య (సాహిత్య అకాడెమీ)
26. వాగర్థ్
27. నయా జ్ఞానోదయ్
28. భారతీయ అనువాద్ పరిషత్ పత్రిక

కన్నడ
29. అనికేతన (ఇతర భారతీయ భాషల నుండి, ఇది ఇంగ్లీషు అనికేతనకి పరిణామం
30. దేశ కళ (అనువాదాలు)
31. సంక్రమణ (విస్తృత అనువాదాలు)
32. సంవాద (తగినన్ని అనువాదాలను అచ్చువేస్తుంది)
33. సంకలన (ఇది కూడా అనువాదాలను అచ్చువేస్తుంది.)

కాశ్మీరీ
34. షీరజ - కాశ్మీరి (కాశ్మీరు ప్రభుత్వం)
35. ఆలవ్ ( కాశ్మీరు ప్రభుత్వం, Govt of Kashmir)

కొంకణి
36. జాగ్ (మాసపత్రిక - విస్తృత అనువాదాలతో)

మలయాళం
37. కేరళ కవిత (ముఖ్యంగా సాహిత్య గ్రంథం, విస్తృత అనువాదాలతో)
38. మాతృభూమి (ప్రత్యేక అనువాద సంచికలు)
39. కళా-కౌముది
40. మధ్యమం

మరాఠి
41. కేల్యానె భాషాంతర్
42. భాషా అని జీవన్
43. ప్రతిస్థాన్ (విస్తృత - అనువాదాలతో)
44. పంచధార (హిందీ, ఉర్దూ, తెలుగు, కన్నడ భాషలో మరాఠీ మూలంలో అనువాదాలు)
45. సాక్షాత్ (ప్రత్యేక అనువాద సంచికలను తీసుకొస్తుంది)
మైథిలి
46. మైథిలి అకాడెమి పత్రిక (జ్ఞానాధారిత గ్రంథాల అచ్చు వేస్తుంది)
47. ఘర్-బాహర్ (అనువాద సంబంధమైనది అచ్చువేస్తుంది)

ఒరియా
48. సప్తభూమిక

పంజాబీ
49. సందర్శి (పంజాబీ అకాడమీ, ఢిల్లీ- కొన్నిసార్లు అనువాద సంబంధమైనవి అచ్చువేస్తుంది)
50. అఖ్ఖర్ (అమృత్సర్, ముఖ్యంగా సృజనాత్మక మరియు విమర్శనాత్మక అనువాదాలను అచ్చువేస్తుంది.

సంతాలీ
51. సర్సగన్
52. లోహంతి పత్రిక

తమిళ్
53. దిశైకాళ్ ఎట్టుమ్ (భారతీయ భాషల నుండి)

తెలుగు
54. విపుల (దాదాపుగా అన్ని భాషల నుండి అనువాదాలు)
55. తెలుగు వైజ్ఞానిక పత్రిక (తెలుగు అకాడెమీ)