న్యాయ చట్రపరిధి

జాతీయ అనువాద సమితి లేక జాఅసను స్థాపించవలసినది ప్రభుత్వ నిర్వాహక ఉత్తర్వుల ద్వారా. భారతీయ భాషల కేంద్రీయసంస్థ ఒక మధ్యవర్తిత్వ సంస్థగా ఉండి, దీని ప్రధాన కేంద్రం మైసూరులో ఉంటుంది, కాని దీని అనుసంధాయక కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. వ్యవహారాల విషయాలకు ఇది అవసరం కూడా. దీని ప్రయోజనాలు దీనికున్నాయి. ఏది ఏమైనప్పటికీ, ఇది ప్రస్తుత ప్రణాళికా కాలం ముగిసిన తరువాత సమీక్షించటానికి అనుమతించబడుతుంది. (కార్యక్రమ అడుగులు స్థిరంగా ఉన్నదీ లేనిదీ) ఇది సి.ఐ.ఐ.ఎల్. నుంచి ప్రత్యేకించబడుతుంది మరియు స్వయంపాలక సంస్థగా సొసైటీస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ (1860 సెంట్రల్ యాక్ట్) కింద ఉంటుంది.

జాఅస కార్యనిర్వాహక ఆకృతిని చూస్తే చిన్నదిగానూ, మరియు వెసులుబాటుగలదిగాను ఉంది. కొద్దిపాటి అవస్థాపనతో ఉంటుంది. జాఅస సంస్థాపరమైన ఆకృతిని ప్రాథమికంగా మూడు అంతరువులుగా ప్రతిపాదించాము.

  » సలహాసంఘం1 గౌరవనీయ - మానవవనరులశాఖ నాయకత్వంలో సభ్యులను కలిగి ఉంటుంది
  » పాలకమండలి2 (పా.మ.) అనుభవంగల పరిశోధకులు మానవవనరుల మంత్రిత్వశాఖనుంచి నియమించిన ఒక సభ్యుడు/సభ్యురాలు పథకపర్యవేక్షణ నిర్వహణను చూడటానికి ఉంటారు.
  » పాలకపరిషత్తు3(పా.ప.) 101 మంది సభ్యులు సంస్థలనుండి మరియు వైయుక్తికంగా జాఅసలో సహ భాగస్థులుగా ఉండటానికి తీసుకుంటారు.

ఏదీ ఏమైనప్పటికీ, ఇప్పటికి ఇంత మంది సభ్యులతో మాత్రమే పథక సలహా సంఘం (ప.స.స., జా.అ.స.,) కలిగి ఉండి, వీరు మార్గదర్శకం చూపుతూ పర్యవేక్షణా సమూహంగా 25 మంది సభ్యులు వ్యవహరిస్తారు. జా.అ.స., పథక నిర్దేశకులు నియామకం అయ్యే అంతవరకు జా.అ.స., - ప.స.స., కి సి.ఐ.ఐ,ఎల్., నిర్దేశకులు ప్రధాన అధికారిగా వ్యవహరిస్తారు. సమితి పనిని ఆపకూడదు. కనుక సి.ఐ.ఐ.ఎల్., విద్యా కార్యదర్శి జా.అ.స., - ప.స.స., సభ్య కార్యదర్శిగా ఉంటారు. అధికారీత్యా సభ్యులు సంయుక్త కార్యదర్శి (భాషల) లేక నిర్దేశకులు (భాషల). ఉన్నత విద్యాశాఖ, ఎమ్.ఎచ్.ఆర్.డి., భారత ప్రభుత్వం, అధికారరీత్యా సభ్యులు స.కా/అస లేక ఐ.ఎఫ్.డి., (ఎచ్.ఆర్.డి.,), మరియు శాస్త్రీయ మరియు సాంకేతిక పరిభాషా సంఘం, సి.ఎస్.టి.టి., అధ్యక్షులు, కొత్త ఢిల్లీ,

ఈ ఐదింటితో పాటు, మానవ వనరుల మంత్రిత్వ శాఖనుండి ఎంపిక చేసుకోబడిన మరో 20 మంది మార్పిడి విధానంలో నియుక్తులవుతారు. అ) అనువాదాన్ని బోధిస్తున్న విశ్వవిద్యాలయ శాఖల నుండి ఇద్దరు ప్రతినిధులు ఆ) మార్పిడి విధానంలో వివిధ రాష్ట్రాల ప్రతినిధులు అకాడెమీలు/సంస్థలలో భాషలు, అనువాదాలను చూస్తున్న ఇద్దరు ఇ) భాషావిశ్వవిద్యాలయాలలోని ఒక ఉప కులపతి ఈ) పుస్తకాల అమ్మకందార్లు, ప్రచురణకర్తల నుండి ముగ్గురు, ఉ) సాహిత్య అకాడెమీ కార్యదర్శి, ఊ) జాతీయ పుస్తకమండలి (జాపుమ) నిర్దేశకులు ఋ) ఐ.ఐ.టి.లు.,/ఎన్.ఐ.టి.,లు అనువాద ఉపకరణాలు, సాంకేతిక జ్ఞతం పరిశోధన మరియు అభివృద్ధిలో పాల్గొంటున్న పారిశ్రామిక సంస్థల నుంచి ఇద్దరు ప్రతినిధులు ఎ) భారతీయ భాషలు మరియు ఇంగ్లిషు నిపుణులు ఐదుగురు, ఏ) వివిధ శాస్త్రాల నుండి ఇద్దరు ప్రతినిధులలో మరియు ఐ) ఒకరు ప్రైవేటు సంస్థల నుండి సమూహిక సంస్థలు లేక ప్రైవేటు వ్యక్తులు అనువాద కార్యకలాపాలలో ఉన్నవారు.

పైవాటితో పాటుగా జాఅస కొన్ని సలహా ఉపసంఘాలను కూడా కలిగి ఉంటుంది లేదా పనివర్గాన్ని కలిగి ఉంటుంది. ఇది వైయుక్తిక సలహాదార్లతోను మరియు నిపుణులతోను ప్రతిశ్రేణిలో కలిగి ఉంటుంది. (శాస్త్రీయ అనువాద, సాంకేతిక అనువాదం/తక్షణ అనువాదం/వ్యాఖ్యానం లేక యంత్రానువాదం మొదలైనవి.


1. ಮಾನವ ಸಂಪನ್ಮೂಲ ಸಚಿವಾಲಯ ಅನುಮೋದಿತ 25 ಸದಸ್ಯರನ್ನು NTMನ ಸಲಹ ಸಮಿತಿಯಲ್ಲಿ ಇರಬೇಕೆಂಬ ಉದ್ದೇಶವಾಗಿದ್ದು, NTMನ ತಿರ್ಮಾನ ಕೈಗೊಳ್ಳುವ ಉನ್ನತ ಸಮಿತಿಯಾಗಿರುತ್ತದೆ.

2. భారీస్థాయిలో అనువాదం కోసం పనిచేస్తున్న వివిధ రాష్ట్రాలు మరియు సంస్థలు, విభిన్న విశ్వవిద్యాలయాల అనువాద బోధకులు, పాలక మండలి (పా.మ.) సభ్యులతో ప్రణాళిక రూపొందించబడింది. సాంకేతిక సంస్థల నుండి ప్రచురణల క్షేత్రం నుండి సభ్యులు అనువాద ఉపకరణాలను, సాంకేతజ్ఞతను వృద్ధిచేసే ఐ.ఐ.టి.లు, ఎన్.ఐ.టి.లు పరిశ్రమలు మొదలైనవాటి నుండి ప్రతినిధులు ఉంటారు అనువాదంలో షరతులపై అధికారికంగా పనిచేసేవారు ఉంటారు. సలహా ఇవ్వడమేమిటంటే అనువాద బోధనలో వివిధ విశ్వవిద్యాలయ శాఖలలో పనిచేస్తున్న ఇద్దరు సభ్యులు, ఇద్దరు వివిధ రాష్ట్రాల నుండి అధికార రాష్ట్ర ప్రతినిధులు (మార్పిడి పద్ధతిలో) సంస్థలు/అకాడెమీలు, భాష, అనువాద లావాదేవీలను చూసుకునేవారు, పుస్తక అమ్మకందార్లు మరియు పుస్తక ప్రచురణకర్తల క్షేత్రం నుండి పంపిన ముగ్గురు సభ్యులు, ఐ.ఐ.టి.లు ఎన్.ఐ.టి.లు పరిశ్రమల నుండి -అనువాద ఉపకరణాలు సాంకేతజ్ఞతలను వృద్ధిపొందించేవారు ఇద్దరు సాహిత్య అకాడెమీ, ఎన్.బి.టి., ఎన్.సి.ఇ.ఆర్.టి. వంటి సంస్థల నుండి షరతుపై పనిచేసేవారు ఇద్దరు. దీని వెనుక ఆలోచన ఏమిటంటే, ప్రభుత్వ ప్రైవేటురంగ సహభాగస్వామ్య ప్రాతినిధ్యాన్ని ప్రతిబింబిస్తూ సృజించబడాలి అని ప్రణాళికా సంఘం మరియు జాతీయ జ్ఞాన సంఘం (జా.జ్ఞా.స.) ఈ మాదిరిని సూచించింది. ఈ సభ్యులు రెండేళ్ల కాల పరిమితిని కలిగి వుంటారు, సి.ఎస్.టి.టి. అధ్యక్షులు, ఆర్థిక సలహాదారు, సంయుక్తకార్యదర్శి అధికారరీత్యా మానవవనరుల మంత్రిత్వశాఖ నియుక్తులై వుంటారు. ఇంకా పాలక మండలి ప్రతి రెండేళ్లకొకసారి మానవ వనరుల శాఖ ద్వారా తిరిగి నిర్మించబడుతుంది.

3. ఆరంభంలో 101 సభ్యులను కలిగి వుండేటట్లుగా పాప సలహా యిచ్చింది. మూడంచుల లేక మూడు అంతరవుల ఆకృతిలో పాలక మండలి (పా.మ.) పాలక సాధారణ పరిషత్తు సభ్యులనుండి సలహాలు పొందుకుంటూ ఉంటుంది. సాధారణ పరిషత్తు సభ్యులు అనువాద పరిశ్రమ, వివిధ రకాల అనువాద సంఘాలు, వైయుక్తిక రచయితలు, నిఘంటు నిర్మాతలు భిన్న భాషా జంటల నుంచి అనువాద ప్రతినిధులు సి.ఎస్.టి.టి., అధ్యక్షులు/నిర్దేశకులు/కార్యదర్శులు, జాతీయ పుస్తక మండలి (ఎన్.బి.టి.), సాహిత్య అకాడెమీ, ఐ.సి.ఎస్.ఎస్, ఆర్., ఐ.సి.పి.ఆర్., వంటి వాటి నుండి, విశ్వవిద్యాలయాల నుండి ప్రఖ్యాతి గాంచిన విద్యావేత్తలు - అనువాద పాఠ్యక్రమాన్ని ఈ శాఖలలో అందిస్తున్నవారు (హింది/ఇంగ్లిష్/భాషాశాస్త్రం/తులనాత్మక సాహిత్యం మొదలైనవి లేక ఎమ్.ఎ.,/ఎమ్.ఫిల్.,/అనువాద అధ్యయనాలు సి.జి.డిప్లొమా కార్యక్రమం, వివిధ జాఞన క్షేత్రాలలో ఇప్పటికే నిమగ్నమైన నిపుణులు (న్యాయ, వైద్య, భౌతిక శాస్త్రాలు, జీవశాస్త్రాలు, సామాజిక, సాహిత్య కళలు మొదలైనవి) పేరుగాంచిన సంస్థలలో సహచరులుగా ఉంటే మంచిది. దీనంతటిపైన, భారతీయ భాషల కార్యకలాపాలలో ఉన్న వివిధ ప్రభుత్వ విభాగాలు మరియు లేక మానవవనరుల, సాంస్కృతిక అంతరంగిక శాఖలు (అధికార భాష శాఖలతో కలిపి) సమాచార మరియు ప్రసార, తంతి సమాచార సాంకేతజ్ఞత మరియు విదేశీ వ్యవహార శాఖలు మొదలైనవి కూడా జాఅస సాధారణ పరిషత్తులో స్థానం కలిగి ఉంటారు.