పాఠ్య ప్రణాళికా సామగ్రి

జాతీయ అనువాద సమితి శిక్షణ కార్యక్రమానికి ఈ పాఠ్య ప్రణాళికా సామగ్రి సహాయకారిగా ఉపయోగపడుతుంది. అనువాదంలో అభిరుచిగల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ స్వల్పకాలిక శిక్షణాకార్యక్రమ పాఠ్య ప్రణాళిక విషయాన్ని సిద్ధపరచటం జరిగింది. ఇది కొన్ని ప్రాథమిక పాఠాలతో కూడుకొని ఉండి, వర్ధమాన అనువాదకునికి ఒక సహాయకారిగా ఉపకరిస్తుంది. జాతీయ అనువాద సమితి నిర్వహించిన కార్యగోష్ఠులు, శిక్షణ కార్యక్రమాలు ఇంకా సదస్సులలో గుర్తించిన జ్ఞాన పుస్తకాల అనువాదంలో ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లు పాఠ్య ప్రణాళికా సామగ్రిలోకూడా పొందుపరచబడ్డాయి. పాఠ్య ప్రణాళికా సామిగ్రిలో ఇవి సవివరణాత్మకంగా ప్రతిఫలిస్తాయి.