|  | 
                 
         
         | 
        లక్ష్యలబ్దిదారులు
                         
    
        
        
            
                | సమితికి పరిమితమైన లక్ష్యలబ్దిదారునప్పటికీ, సమాజానికి చివర ఉన్న బలహీనవర్గాల విద్యార్థులు
                    మొట్టమొదటివారు, అత్యంత ప్రధానమైనవారు కూడా. వారి ప్రాంతము భౌగోళిక నేపథ్యము, గ్రామీణ,
                    పాక్షిక పట్టణ (ప్రాంతాలు), ముఖ్యంగా సామాజికపరమైన కుల, వర్గ ప్రాతిపదికన అణగారిన విద్యార్థులకు
                    ఈ శాస్త్రీయ సాంకేతిక జ్ఞానం ఎక్కువగా ఇంగ్లిషులోనే లభ్యమవుతూ అతి తక్కువగా అందుబాటులో
                    ఉంది. సమాజ అంచున ఉండి ఎదురుచూస్తున్న ఈ వర్గాలవారికి వైవిద్యభరిత శాస్త్రాలను అనువదించి,
                    ఆయా గ్రంథాల జ్ఞానం వీరికి చేరుకున్నప్పుడే సమితి నిజమైన లక్ష్యాన్ని సాధించగలిగేది. 
 ఏది ఏమైనప్పటికీ, ఈ ప్రక్రియ చేరుకొంటూనే పాక్షిక లబ్దులు ఎక్కువ వర్గాలకీ అందుతుంది.
                    అవి:
 |  
            
                | 1. | ఏది ఏమైనప్పటికీ, ఈ ప్రక్రియ చేరుకొంటూనే పాక్షిక లబ్దులు ఎక్కువ వర్గాలకీ అందుతుంది.
                    అవి: |  
                | 2. | అనువాదం చేయటానికి నియుక్తమయ్యే అనువాదకులకు వారిపనికి తగినంత మూల్యం లభించటం, |  
                | 3. | భాషలలో కొత్త పుస్తకాలను అచ్చవేయాలని అనుకునే ప్రచురణకర్తలకు, |  
                | 4. | పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాలలో క్రమంగా బోధిస్తున్న ఉపాధ్యాయులకు |  
                | 5. | అనియత విద్యలో నిమగ్నమైన స్వచ్ఛంద సేవకులకు, |  
                | 6. | ప్రజాఆరోగ్యం, పౌరహక్కులు, పర్యావరణం, విజ్ఞాన శాస్త్రాల ప్రాచుర్యీకరణ వంటి పరిసరాలలో
                    పని చేస్తున్న ఎన్.జి.ఓ. లకు. |  
                | 7. | వ్యాఖ్యాతల కోసం చూస్తున్న సంస్థలకు |  
                | 8. | వ్యాఖ్యానం కావలసిన పర్యాటనకు, విదేశస్థులకు |  
                | 9. | చలనచిత్రాన్ని తయారుచేసేవారు, నిర్మాతలు, ప్రచారకులకు ఉపశీర్షికల నిమిత్తం ఎదురుచూస్తున్నవారికి,. |  
                | 10. | విభిన్న భాషలలో ప్రసారం చేయాలనుకుంటున్న రేడియో మరియు టి.వి. కార్యక్రమ ఉత్పాదకులు |  
                | 11. | అనువాద శిక్షణ పొందుతున్న వారికి, |  
                | 12. | విశ్వవిద్యాలయాలలోని అనువాద శాఖలు మరియు ఇతర అనువాద సంస్థలకు. |  
                | 13. | రకరకాల అనువాద సంబంధ క్షేత్రాలలోని పరిశోధకులకు . |  
                | 14. | అనువాద సాఫ్టువేర్ల వృద్ధిదార్లకు. |  
                | 15. | తులనాత్మక సాహిత్య పరిశోధకులకు. |  
            
                | గుణవంతమైన అనువాద పరిశ్రమను తీవ్రస్థాయిలో ప్రారంభించటానికి, అనువాదకుల కోసం జాతీయ
                    జాబితా పెంపుదల చేయాలని సూచించడం అది అనుకృతి వెబ్సైట్లో కలిసివుంది. దానిని ఇంతకు
                    ముందు సాహిత్య అకాడెమీ అచ్చురూపంలో ప్రచురించింది. దానితోపాటు అన్ని అనువాద సంఘాలను
                    కూడా లీనం చేయాలి. (ఇప్పుడు దేశంలో అనేకం ఉన్నాయి) . వైయుక్తిక ప్రచురణ సంస్థల నుంచి
                    అనువాదకుల సమూహాలు కూడా. ఈ ప్రక్రియ అంతా వృత్తిపరంగా చాలా నైపుణ్యంతో నిర్వహించబడుతుంది.
                    వీటే సేవలను ప్రభుత్వానికి, మరియు ఇతర సంస్థలకు, కొన్ని సందర్భాలలో త్వరితగతి - హద్దులతో
                    కొన్ని గ్రంథాలను అనువాదించి అందిస్తుంది. దీనితో పాటుగా అనువాద మేళాలను (అన్ని చిన్న
                    పట్టణాలలో కూడా అనువాద ప్రదర్శనలు, దానికి సంబంధించి అవగాహన కల్పించేకార్యకలాపాలు)నిర్వహించాలి.వృత్తిరీత్యా
                    అనువాదకుల శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడంవల్ల సరైన మానవసామర్థ్యాన్ని గుర్తించవచ్చు
                    మరియు ఉత్పాదన చేయవచ్చు. ఈ విధానం భారీ అనువాద పరిశ్రమగా ఫలితమిస్తుందని ఆశిస్తున్నాము. 
 సామాన్య ప్రజలకు సంపూర్ణలబ్ది కలుగజేయటానికి మరియు ఎందుకంటే ఈ జ్ఞానగ్రంథాలు మన బోధక
                    పరిశోధక సంస్థ అవసరాన్ని తీర్చగలిగి ఉండాలి. అచ్చువేసిన పుస్తకాలు సాధారణ ధరలు కలిగి
                    ఉండటం, కాని ఇది అనువాదాలలో ప్రవేశంగలవారికే. అలాంటి పుస్తకాలన్నీ ఈ - పుస్తకాలుగా
                    ఉచితధరకు అందుబాటులో ఉంచటం, ఇది భారీ అనుసంధాన వెబ్సైట్- ఆతిథేయ0 జాఅస నుంచి సి.ఐ.ఐ.ఎల్.
                    సర్వరు ద్వారా నిర్వహించబడుతుంది. కేవలం ఉపయోగితాదార్ల నమోదుకు ఒక జాబితా ఉంటుంది.
                    దానివలన మన నెట్ అధారిత గ్రంథాలను ఉపయోగించుకున్నవారి జాబితా ఉంటుంది. ఇది వారినుండి
                    మనం తిరుగు సలహాలు పొందటానికి కూడా ఉపయోగపడుతుంది. చివరగా, అనువాద ఉపకరణాలు సృజించటం-
                    అవి నిఘంటువులు, పర్యాయపదకోశాలు, పదశోధనిలు, పదకోశాలు, వ్యుత్పత్తి పదకోశాలు, దృశ్య
                    మరియు శ్రవణ నిఘంటువులు మొదలైనవి, ఇంకా బాహ్య వనరుల ప్యాకేజి ద్వారా అన్నింటిని అందుబాటులో
                    ఉంచవచ్చు.
 
 వివిధ భాషా జంటలకు డిజిటల్ నిఘంటువులను మరియు యంత్ర సహాయక అనువాద సాఫ్టువేర్ తయారు
                    చేయటానికి జాఅస ప్రాధాన్యతలను కలిగి ఉంటుంది. కాని, ఐ.ఐ.టి.లు, ఐఐఐటీలు విశ్వవిద్యాలయాలు,
                    టి.ఐ.ఎఫ్.ఆర్., ఐ.ఐ.ఎస్.సి. కలిసి మరియు పెద్ద సాఫ్టువేర్ సంస్థలు ఈ యంత్రానువాద సమస్యపై
                    గత రెండు దశాబ్దాలుగా పని చేస్తున్నాయి. కానీ పూర్తిస్థాయిలో సమస్యలు పరిష్కరింపబడి
                    తప్పులు లేని ఉపకరణాలు ఇంకా రాలేదు. కనుకనే జాఅస జాగ్రత్తగా దీని మీద దృష్టి నిలుపుతుంది.
                    ఈ సిఫారులలో కొన్నిభాగాలు తొందరలోనే ఆచరణలో పెడతాం (డిజిటల్ నిఘంటువులు, పదశోధనిలు,
                    పర్యాయ పదకోశాలు) ఇంకా మరికొన్ని ఇతరాలు (స్వయంచలిత ఉపకరణాలు)
 |  
                |  |  |  |