| 
         
         
         
         
                
    
                
                
                
                
                
                
                    
                    
                     
                    
             
              | 
             
        
               
                
                 
         
         
         
         
            
    
        కార్యనిర్వహణ ఏర్పాట్లు
         
         
                    
                         
    
        
        
            
                
                    కార్యనిర్వహణ 
                    సి.ఐ.ఐ.ఎల్. ప్రధానసంస్థగా జాతీయ అనువాద సమితిని ఏర్పాటు చేసి కార్యకలాపాలను జరుపుతుంది.
                    సి.ఐ.ఐ.ఎల్. నిర్దేశకుడు పథక ప్రణాళిక ఆచరింపజేసే ముఖ్య అధికారిగా ఉంటారు. జాఅస పథకనిర్దేశకులు
                    జాఅస పథక సలహా సంఘ కార్యదర్శిగా కూడా పని చేస్తారు. (సంక్షిప్తనామం జాఅస - పసస).
                     
                     
                    పథక సలహా
                        సంఘం (జాఅస - పసస) 
                     
                    జాఅస - పసస రూపం ఈ విధంగా ఉంటుంది:
                 | 
             
         
        
            
                | 
                    నిర్దేశకులు, భారతీయ భాషల కేంద్రీయ సంస్థ, మైసూరు
                 | 
                
                    అధ్యక్షుడు
                 | 
             
            
                | 
                    సంయుక్త కార్యదర్శి నియుక్తుడు (భాషలు); లేక నిర్దేశకుడు (భాషలు), ఉన్నత విద్యాశాఖ,
                    మానవ వనరుల మంత్రిత్వశాఖ
                 | 
                
                    సభ్యుడు/రాలు
                 | 
             
            
                | 
                    జెఎస్ మరియు ఎఫ్ఎ లేక ఐఎఫ్డి (మానవ వనరుల మంత్రిత్వశాఖ) నియుక్తుడు
                 | 
                
                    సభ్యుడు/రాలు
                 | 
             
            
                | 
                    జెఎస్ మరియు ఎఫ్ఎ లేక ఐఎఫ్డి (మానవ వనరుల మంత్రిత్వశాఖ) నియుక్తుడు
                 | 
                
                    సభ్యుడు/రాలు
                 | 
             
            
                | 
                    అనువాదాన్ని బోధిస్తున్నవిశ్వవిద్యాలయ శాఖల నుంచి ఇద్దరు ప్రతినిధులు
                 | 
                
                    సభ్యులు
                 | 
             
            
                | 
                    అవివిధ రాష్ట్రాల నుంచి ఇద్దరు ప్రతినిధులు (మార్పిడి విధానంలో) ఆయా అకాడెమీలకి/సంస్థలకి
                    చెంది, భాష అనువాదాలతో సంబంధమున్నవారు.
                 | 
                
                    సభ్యులు
                 | 
             
            
                | 
                    భాషా విశ్వవిద్యాలయాల ఉపకులపతి ఒకరు.
                 | 
                
                    సభ్యుడు/రాలు
                 | 
             
            
                | 
                    పుస్తక విక్రేతలు, ప్రచురణకర్తల నుంచి ముగ్గురు.
                 | 
                
                    సభ్యులు
                 | 
             
            
                | 
                    సాహిత్య అకాడెమీ, కార్యదర్శి
                 | 
                
                    సభ్యుడు/రాలు
                 | 
             
            
                | 
                    జాతీయ పుస్తకమండలి, నిర్దేశకులు
                 | 
                
                    సభ్యుడు/రాలు
                 | 
             
            
                | 
                    నువాద పరిశోదన అభివృద్ధి ఉపకరణాల, సాంకేతజ్ఞత , పరిసరంలో పనిచేస్తున్న ఐఐటిలు/ఎన్ఐటిలు/పారిశ్రామిక
                    సంస్థల నుంచి ఇద్దరు
                 | 
                
                    సభ్యులు
                 | 
             
            
                | 
                    8మంది అనువాద నిపుణులు ప్రైవేటు/సామూహిక సంస్థల నుంచి, ప్రైవేటు వ్యక్తులు - అనువాద
                    వ్యాపకాలలో ఉన్నారు
                 | 
                
                    సభ్యులు
                 | 
             
            
                | 
                    పథక నిర్దేశకులు, జాతీయ అనువాద సమితి లేక అతడు/ఆమె లేనపుడు అకాడమిక్ కార్యదర్శి, సిఐఐఎల్
                 | 
                
                    సభ్యులు కార్యదర్శి
                 | 
             
         
        
        
            
                
                    జాఅస సంఘంలో సభ్యత్వం
                    
                     
                    జాఅస కార్యకలాపాలలో సభ్యత్వమనేది సాధారణంగా వృత్తిపరంగా నిపుణులకు, వర్థమాన అనువాదకులకు
                    వెసులుబాటు ఉంటుంది. ఆయా సంస్థలు మరియు అనువాద అభిరుచి గలిగిన వ్యక్తులు జాఅసలో నమోదు
                    చేసుకోటానికి వివరాలు ఎక్కడనుంచైనా వెబ్సైట్లో చూడవచ్చు.
                     
                     
                    పథక నిర్దేశకుడు
                    
                     
                    జాతీయ అనువాద సమితి పథక నిర్దేశకుని కమిటీ నియమిస్తుంది. అది సంయుక్తకార్యదర్శి (భాషలు)
                    అధ్యక్షుడిగా సి.ఐ.ఐ.ఎల్. నిర్దేశకులు సభ్యకార్యదర్శిగా, ముగ్గురు నిపుణులు, జాఅస-పసస
                    నుంచి ఇద్దరు; బయటి నుండి ఒకరు వీరిని ఉన్నత విద్యా కార్యదర్శిని నియమించారు. పథక నిర్దేశకులకు
                    ఉండదగిన మరియు ముఖ్యమైన యోగ్యతలు ఈ కిందివి:
                 | 
             
         
        
        
            
                | 
                    (i)
                 | 
                
                    జాఅస పథక నిర్దేశకులు 5 సంవత్సరాల కాలానికి నియమితులైనారు.
                 | 
             
            
                | 
                    (ii)
                 | 
                
                    జాఅస పథక నిర్దేశకులు 60 ఏళ్ళలోపు వయసు ఉంటే మంచిది.
                 | 
             
            
                | 
                    (iii)
                 | 
                
                    నియుక్తులయ్యే పరిశోధకులు/స్నాతకోత్తర పట్టభద్రులై ఉండాలి. అనువాద అధ్యయనాలు/భాష/సాహిత్య
                    తులనాత్మక అధ్యయనంతో కలిపి/భాషాశాస్త్రం/లేక అనువాద క్షేత్రంలో నిపుణత కలిగి ఉండాలి.
                 | 
             
            
                | 
                    (iv)
                 | 
                
                    పరిశోధన/బోధనలో 15 సం//అనుభవం ఉండాలి.
                 | 
             
            
                | 
                    (v)
                 | 
                
                    అనువాద అధ్యయనాలు నిఘంటు నిర్మాణంలో కూడా ప్రచురణలను కలిగి యుండాలి.
                 | 
             
            
                | 
                    (vi)
                 | 
                
                    అచ్చువేసిన అనువాదానికి ఆధారాలు ఉండాలి.
                 | 
             
         
        
        
            
                
                    జాఅస పథక నిర్దేశకులు సిఐఐఎల్ నిర్దేశకునికి నివేదించాల్సి ఉంటుంది. తరువాతది సమితి
                    ముఖ్యధికారి. తగిన గుత్త ఒప్పందాల మీద సంతకాలు చేయటం కాని కలిసి భాగస్వాములుగా పనిచేసేవారి
                    (ఎమ్ఓయు) ఒప్పందాలుగాని, క్రిందిస్థాయిలోని ఉత్తర ప్రత్యుత్తరాలుగాని చేయవలసినది పథక
                    నిర్దేశకులే. జాఅస పథక నిర్దేశముల పనులు ఈ విధంగా ఉంటాయి:
                     
                     
                 | 
             
         
        
        
            
                | 
                    (అ)
                 | 
                
                    దస్తావేజులకు, ప్రచురణలకు/ఈ ప్రచురణలకు, సంస్థకు సంబంధించిన ఆర్జి అంతటికి అతడు/ఆమె
                    జవాబుదారీగల సంరక్షకునిగా ఉంటారు.
                 | 
             
            
                | 
                    (ఆ)
                 | 
                
                    సంస్థ అధికారుల తరపున ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటం.
                 | 
             
            
                | 
                    (ఇ)
                 | 
                
                    జాఅస-పససకు వివిధ పని వర్గాలను కమిటీలను సమన్వయపరచి పసస నిర్దేశకుని సూచనమేరకు సమావేశపరచటం.
                 | 
             
            
                | 
                    (ఈ)
                 | 
                
                    ఈ కమిటీల సమావేశాల నిర్ణయ వివరాలను భద్రపర్చటం;
                 | 
             
            
                | 
                    (ఉ)
                 | 
                
                    జాఅస ఖాతా నిర్వహించుకోవాలి.;
                 | 
             
            
                | 
                    (ఊ)
                 | 
                
                    జాఅస-పసస అధికారాలు, బాధ్యతలు డబ్బు విషయాలలో ఏయే ప్రయోజనాలతో, ఏయే ఉద్దేశాలతో నిధులు
                    ఇచ్చారో వాటికి కేటాయించేటట్లు చూడటం;
                 | 
             
            
                | 
                    (ఋ)
                 | 
                
                    ప్రతి ఆర్థిక సంవత్సర ఆరంభంలో సమితి బడ్జెట్ తయారు చేయటం దీనిని సి.ఐ.ఐ.ఎల్. నిర్దేశకునిద్వారా
                    మంత్రిత్వ శాఖ అంగీకారానికి పంపటం, ఆమోదం పొందటం
                 | 
             
            
                | 
                    (ఎ)
                 | 
                
                    పాలక మండలి ఇచ్చిన ఆర్థిక, కార్యనిర్వాహక అధికారాలను ప్రయోగించటం.
                 | 
             
            
                | 
                    (ఏ)
                 | 
                
                    పైన చెప్పినవాటిలోనైనా సరిగా లేకపోయినట్లైతే భారతప్రభుత్వం ఏ సమయములోనైనా పథక నిర్దేశకుడు
                    ఎంపిక అయిన తరువాత కూడా ప్రవర్తన సరిగాలేని కారణంగా తీసివేయవచ్చు
                 | 
             
         
        
        
            
                
                    సిబ్బంది పూరకం 
                     
                    జాఅస శాశ్వత ఉద్యోగాలను సృజించదు. అవసరమైనప్పుడు వ్యక్తులను స్వల్పకాలిక గుత్త పద్ధతిన
                    తీసుకుంటారు. వీలైనంత ఎక్కువ బయట పనులను చేయించుకునే విధానంలో సేవలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ,
                    అంతర్భాగంగా పథకంలో 65 మంది సిబ్బంది ఉంటారు. దీనిలో మూడోవంతు ఢిల్లీ కార్యాలయంలో ఉంటారు,
                    మిగిలినవారు మైసూరులో పని చేస్తారు. దీనితోపాటు, ప్రత్యేక పనులకు అనేకమంది సమాలోచనకర్తలు
                    ఉంటారు. వీరు వివిధ భారతీయ భాషలలో ప్రత్యేకతలు కలిగి వుంటారు.
                     
                     
                    మంది జాఅస సిబ్బంది తాత్కాలిక ప్రణాళిక వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
                 | 
             
         
        
        
            
                | 
                    క్రమసంఖ్య
                 | 
                
                    ప్రధానవైనవి
                 | 
             
            
                | 
                    1.
                 | 
                
                    మానవ వనరులు (మొత్తం 65 మంది)
                 | 
             
            
                | 
                    (అ)
                 | 
                
                    పథక నిర్దేశకుడు/రాలు (1) @ రూ..40,000 పైన
                 | 
             
            
                | 
                    (ఆ)
                 | 
                
                    ఉపనిర్దేశకులు/ప్రొఫెసర్లు (4) – శాస్త్రీయ, సాంకేతజ్ఞత సామూహిక/మానవీయ @ రూ.35,000
                    – 38,000
                 | 
             
            
                | 
                    (ఇ)
                 | 
                
                    రీసర్చ్ ఆఫీసర్లు/రీడర్లు (12)– (ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర భారతదేశానికి @ రూ.29,000
                    – 32,000
                 | 
             
            
                | 
                    (ఈ)
                 | 
                
                    జూనియర్ రీసర్చ్ ఆఫీసర్లు/సీనియర్ లెక్చరర్ మరియు లెక్చరర్లు (12) నాలుగు జోన్లకు మరియు
                    ఉత్తర - తూర్పు ఒకటి @ రూ. 20,000 – 26,000
                 | 
             
            
                | 
                    (ఉ)
                 | 
                
                    రీసర్చ్ అసొసియేట్లు (5) @ Rs.15,500 – 18,000
                 | 
             
            
                | 
                    (ఊ)
                 | 
                
                    సీనియర్ ఎడిటర్లు/వెబ్ ఎడిటర్లు - సమన్వయానికి (5) - ఒక్కొక్క జోనుకు ఒకరు, ఉత్తర తూర్పు
                    ప్రాంతానికి ఒకటి @ రూ.24,000 – 26,000
                 | 
             
            
                | 
                    (ఋ)
                 | 
                
                    సబ్ఎడిటర్లు ప్రింట్ మరియు వెబ్ (5) - @ రూ.20,000 – 22,000
                 | 
             
            
                | 
                    (ఎ)
                 | 
                
                    అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు (అకౌంట్సు) (1) @ రూ.22,000
                 | 
             
            
                | 
                    (ఏ)
                 | 
                
                    ఆఫీస్ సూపరింటెండెంట్ (2)
                 | 
             
            
                | 
                    (ఐ)
                 | 
                
                    సీనియర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్లు(4) @ రూ.24,000 – 26,000
                 | 
             
            
                | 
                    (ఒ)
                 | 
                
                    జూనియర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్లు (10) @ రూ.20,000 – 22,000
                 | 
             
            
                | 
                    (ఓ)
                 | 
                
                    డేటా ఎంట్రి ఆపరేటర్లు (2) – ఇంగ్లీష్/భారతీయ భాషలు.
                 | 
             
            
                | 
                    (ఔ) ఆఫీస్ సిబ్బంది - అకౌంట్సు (2)
                 | 
                
                    ఆఫీస్ సిబ్బంది - అకౌంట్సు (2)
                 | 
             
         
        
        
            
                | 
                    ప్రణాళికలో అంచనా వేసిన మొత్తం వ్యయం ( మారవచ్చు. రూ. 4,26,53,012 )
                 | 
             
            
                | 
                     
                 | 
             
            
                
                    స్థానం 
                     
                    ఇ.ఎఫ్.సి. (మరియు పి.ఎ.ఎమ్.డి.) నిర్ణయించినదేమిటంటే, సమితి ఒక భవనంలోనే ఉండి పనులన్నీ
                    చేయటం మంచిది. దీనికి శాశ్వత భవనం ఉండకూడదని కాదు. కనుక నిర్ణయించినదేమిటంటే, సిఐఐఎల్
                    ఆవరణలో మైసూరు నుంచే పనిచేయటం ప్రారంభిస్తుంది. సిఐఐఎల్ జాఅసని సమన్వయపరచటానికి, ఆరంభించటానికి
                    కావలసిన సామర్థ్యం ఉంది. కార్యకలాపాల ప్రయోజనాలకు ఒక కార్యాలయాన్ని మైసూరులో అద్దెకు
                    తీసుకొనవలసి ఉంది.
                     
                     
                    ఏదిఏమైమప్పటికీ, సంస్థలు, సామూహికసంస్థలు, ఐ.టి.ఐ./సాఫ్టువేరు నిపుణులు, ప్రచురణకర్తలు,
                    స్వయం ప్రతిపత్తిగల సాంస్కృతిక సంస్థలు, భారతీయ మరియు విదేశీయ భాషానిపుణులు మొదలైనవారితో
                    జాఅస నిరంతరం పరస్పర సంబంధాలు కలిగి ఉంటుంది. వివిధ కమిటీలలో సమాలోచనకర్తలు, నిపుణులు
                    అనేక మందిని కలిగి ఉండాలనుకుంటున్నారు. జాఅస అనుసంధాయక కార్యాలయాన్ని ఢిల్లీలో ఉండాలని
                    నిర్ణయించటం జరిగింది. (లేక) దేశ రాజధాని ప్రాంతం, ఢిల్లీలో దాదాపు అన్ని ప్రచురణ సంస్థలు,
                    ఐ.టి.ఐ. లో మరియు వివిధ భారతీయ భాషలలో నిపుణులు మరియు ఢిల్లీలో అనేక స్వయం ప్రతిపత్తి
                    కలిగిన సాంస్కృతిక సంస్థలు, అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఢిల్లీలో
                    అనుసంధాయక కార్యాలయం ఒక అద్దె భవనంలో పనిచేయటం ప్రారంభిస్తుంది.
                     
                     
                    కాలపరిమితి 
                     
                    జాఅస కార్యకలాపాలు వివిధ భారతీయ భాషల మధ్య సాహిత్య, జ్ఞాన గ్రంథాల అనువాదాలు ఉన్నంతకాలం
                    ఉండవలసిన అవసరం ఉంది. జ్ఞానం ఎప్పుడూ విస్తృతమవుతూనే ఉంటుంది. కొత్త పుస్తకాలు నిరంతరం
                    ఉత్పాదన అవుతూనే ఉంటాయి. జాఅస భవిష్యత్తులో ముగింపును ముందుగా కనుగొనటం కష్టం.
                 | 
             
            
                | 
                     
                 | 
             
         
     
                
                
            
                     
                        
                    
                    
    
                    
                    
                     | 
                     
                     
                    
                 
                
                |